డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ "లైగర్" ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పూరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన పోకిరి, బిజినెస్ మాన్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించాలనుందని చెప్పారు.
2006 లో విడుదలైన "పోకిరి" మహేష్ కు ఫుల్ మాస్ ఇమేజ్ ను, సూపర్ స్టార్ స్టేటస్ ను తీసుకొచ్చింది. అంతేకాక తెలుగు చిత్రచరిత్రలో ఒక మచ్చుతునకలా నిలిచిపోయే సినిమా. అలానే 2012లో విడుదలైన "బిజినెస్ మాన్" కూడా ఒక డిఫరెంట్ స్టోరీ తో, పక్కా మాస్ మసాలా ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. ఈ రెండు సినిమాలలో కూడా హీరో క్యారెక్టరైజేషన్ కు చాలా మంచి ఐకానిక్ ఇమేజ్ ఉంటుంది. దీంతో ఈ రెండు క్యారెక్టర్లను కూడా ఇంకా ఎలాబోరేట్ చెయ్యొచ్చని అనుకుని, ఆ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కిద్దామని అనుకున్నాడట పూరి. కానీ, ప్రెజెంట్ మహేష్ బిజీ స్టార్ హీరో. అదీకాక జక్కన్నతో పాన్ ఇండియా సినిమా కమిట్ అయ్యాడు కాబట్టి మరో నాలుగైదేళ్లు మనకు అందుబాటులోకి రాడనుకుని ప్రస్తుతం ఆ ఆలోచనను విరమించుకున్నాడట.