బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ నటించిన కొత్త చిత్రం "లాల్ సింగ్ చద్దా". టాలీవుడ్ యువనటుడు నాగచైతన్య కీరోల్ ప్లే చేసిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలై అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
అద్వైత్ చందన్ డైరెక్షన్లో హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్' కి ఇండియన్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో కూడా డిజాస్టర్ అయ్యింది.
లాల్ సింగ్ చద్దా పరాజయానికి సోషల్ మీడియాలలో ట్రెండ్ ఐన బాయ్ కాట్ ఆమీర్ ఖాన్, బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా హ్యాష్ ట్యాగ్ లు కూడా ఒక ముఖ్యకారణమని చెప్పొచ్చు.
పద్నాలుగేళ్ళు కష్టపడి మరీ ఫారెస్ట్ గంప్ రైట్స్ ను చేజిక్కించుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఆమీర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, మీడియాకు ముఖం చాటేస్తున్నారట. ఒక రెండు నెలల పాటు తన కొడుకుతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. అక్కడ మనసు ప్రశాంత పరచుకుని, తదుపరి ఇండియాకు వచ్చి, నెక్స్ట్ మూవీ పనులను స్టార్ట్ చేస్తారంట.