కాఫీ విత్ కరణ్ బాలీవుడ్ లో ఎంతో పాప్యులర్ షో ఈ షోలో సెలబ్రిటీల పర్సనల్ విషయాలు లాగడమే ఈ షో లక్ష్యంగా తయారైంది హోస్ట్ కరణ్ జోహార్. ఇటీవల సిద్దార్థ్ మల్హోత్రా అలాగే కియారా అద్వానీ ఆమెతో పాటు హీరో షాహిద్ కపూర్ కూడా గెస్ట్‌గా విచ్చేశాడు కరణ్ అద్వానీ ని నువ్వు బెడ్‌రూమ్‌లో దొంగా పోలీసు వంటి ఆటలు ఆడలేదా అని అడిగాడు. దీనికామె కొంత ఇబ్బందిగా చూస్తూ మా అమ్మ ఈ ఎపిసోడ్ చూస్తుంది అని బదులిచ్చింది. అయినా వెనక్కు తగ్గని హోస్ట్ అయితే ఏంటట మీ అమ్మ నువ్వింకా కన్యవనే అనుకుంటుందా, ఏంటి అని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనికి కియారా నాకు తెలిసినంతవరకు అవుననే అనుకుంటున్నా అని ఆన్సరిచ్చింది. సిద్దార్థ్‌తో నువ్వు రిలేషన్‌లో లేవా అన్న ప్రశ్నకు అవుననీ చెప్పను, కాదనీ చెప్పను అని తెలివిగా ప్రశ్నను దాటవేసింది. అయితే మీరు క్లోజ్ ఫ్రెండ్సా అని అడిగారు .. క్లోజ్ ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువే అని తెలిపింది. కాగా కియారా అద్వానీ ప్రస్తుతం సత్య ప్రేమ్ కీ కథ అనే సినిమా చేస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగానటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.