బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ తొలిసారి జంటగా నటించిన చిత్రం "బ్రహ్మాస్త్ర". అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో మోడరన్ మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మొత్తం శివుడి నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం కోసం దర్శకనిర్మాతలు "అస్త్రవర్స్" అనే కొత్త లోకాన్ని సృష్టించారు. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి 'డాన్స్ కా భూత్' అనే ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు. ప్రీతం స్వరపరిచిన ఈ పాటను అర్జిత్ సింగ్ ఆలపించగా, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించారు. వందల కొద్దీ డాన్సర్స్ తో, కలర్ ఫుల్ విజువలైజేషన్ తో, రణ్ బీర్ వేసే మాస్ స్టెప్పులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలకాబోతుంది.