పెళ్లి చూపులు సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా యూత్ లో ఫుల్ క్రేజ్ ను, స్టార్ హీరో స్టేటస్ ను అందుకుంది మాత్రం సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన "అర్జున్ రెడ్డి" సినిమాతోనే.
2017 ఆగస్టు 25వ తేదీన విడుదలైన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తొలి సినిమాతోనే టాలీవుడ్ ను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఐదు కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యాభై కోట్లను కలెక్ట్ చేసి కంటెంట్ ఉన్న సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో చూపించింది.
ఈ సినిమాను సందీప్ రెడ్డి తన బ్రదర్ ప్రణయ్ రెడ్డి తో కలిసి సొంతంగా నిర్మించారు. ఆపై ఈ చిత్రం తమిళం, హిందీ భాషలలో రీమేకై అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలై ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ రోజే VD తొలి పాన్ ఇండియా సినిమా కూడా విడుదలయ్యింది. మరి ఆ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.