టి సిరీస్ అధినేత, ప్రముఖ ఆడియో కింగ్, దివంగత గుల్షన్ కుమార్ బయోపిక్ మొఘల్ పేరుతో మూవీగా రానుంది.ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను తీసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలకు చోటుంది. పెళ్లికి ముందు గుల్షన్‌కుమార్‌కు ఉన్న ప్రియురాళ్లలో ఒకరిగా సోనాక్షి నటించనుంది. ఈ చిత్రంలో చాలామంది ప్రముఖ తారలు కనిపించనున్నారు. ఈ చిత్రంలో నటించడానికి సోనాక్షి కూడా అంగీకరించిందట. అమీర్‌ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తూ సహ నిర్మాతగా కూడా వ్యవహరించడానికి రంగం సిద్ధమైంది. ఇంతలోనే చిత్ర దర్శకుడు సుభాష్ కపూర్‌పై మీ టూ ఆరోపణలు రావడంతో అమీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. వీలైనంత త్వరగా ఈ చిత్రానికి మరో కొత్త దర్శకుణ్ని తీసుకొచ్చే పనిలో ఉన్నారు నిర్మాత భూషణ్ కుమార్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa