ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సావన్ కుమార్ టక్ కన్నుమూశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న ఆస్పత్రిలో చేరగా గురువారం సాయంత్రం 4:15 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మరణవార్త విని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.