తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలుపోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోని ఒక వీడియో సాంగ్‌లోని కొంత భాగం సోషల్ మీడియా లో లీక్ అయింది. ఈ పాటను ఆన్‌లైన్‌లో లీక్ చేసింది దర్శకుడు అమీర్ కొడుకు అని నెటిజన్లు గుర్తించారు. ప్రొడక్షన్ టీమ్ నుండి అనేక హెచ్చరికల తర్వాత, అతను పోస్ట్‌లను తొలగించి తన ప్రొఫైల్‌ను లాక్ చేశాడు. మరోవైపు, వరుస లీక్‌లతో విజయ్ అభిమానులు నిరాశ మరియు కోపంతో ఉన్నారు. లీక్‌లను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు మూవీ టీమ్ ని అభ్యర్థిస్తున్నారు. ఈ చిత్రానికి 'వారసుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.