మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ పాన్-ఇండియన్ సినిమా ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ లాంచ్ ఈవెంట్ కి తక్కువ మంది హాజరయ్యారు అని సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ 40 రోజులు కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్క, కృతి శెట్టి, శ్రీలీల, మాళవిక మోహనన్‌లు కథానాయికలుగా నటించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బొమన్ ఇరానీ లేదా పరేష్ రావల్ ముఖ్యమైన పాత్రలో కనిపించవచ్చు అని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.