కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'విక్రాంత్ రోణ' జులై 28న థియేటర్లలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. వచ్చే నెల 2న జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 ఓ వీడియో షేర్ చేసింది. అయితే, కన్నడతోపాటు మిగతా భాషల్లోనూ ఇక్కడ అందుబాటులో ఉండనుందా?లేదా? అనేది తెలియాల్సి ఉంది.