స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో క్రిష్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ ఎన్టీఆర్. ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో రెండు పార్ట్‌లుగా విడుదల కానున్న ఈ చిత్రంలో పలు పాత్రలకి సంబంధించిన పోస్టర్స్ వారి వారి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూతురు పురుందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర పోషిస్తున్న డాక్టర్ భరత్ రెడ్డి లుక్ విడుదల చేశారు. భరత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్‌లో బాలకృష్ణ వెనుకనున్న భరత్.. దగ్గుబాటి వెంకటేశ్వరావు పాత్రలో ఆకర్షణగా ఉన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్నారు వెంకటేశ్వరరావు. అందుకే ఆయన పాత్ర కోసం పలువురిని పరిశీలించిన టీం చివరికి భరత్ రెడ్డిని ఫైనల్ చేసింది. ఎన్టీఆర్ చిత్రం ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితం నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa