హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఎపిక్ లవ్ స్టోరీ "సీతారామం" ఆగస్టు ఐదవ తేదీన విడుదలై ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో అందరికి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళ భాషలలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 2 నుండి హిందీ థియేటర్లలో కూడా విడుదల కాబోతుంది. పెన్ మూవీస్ ద్వారా హిందీ జనాలను సీతారామం మూవీ పలకరించబోతుంది.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రంలో రష్మీక మండన్నా కీరోల్ ప్లే చేసింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్త బ్యానర్ లపై స్వప్న, ప్రియాంక నిర్మించిన ఈ చిత్రంలో సుమంత్, భూమిక, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa