సునీల్ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీత మ్యూట్ విట్నెస్ మూవీస్’పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా.ఆర్.రావు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ... ‘ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ‘గీత’ విడుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న పొలిశెట్టి, డివిడి విజయ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు’ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa