పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకోవాలని భావించాను. కానీ నా వివాహాన్ని చాలా ఘనంగా చేయాలని మా అమ్మ కోరిక. ఎందుకంటే నా సోదరుడు, సోదరి వివాహ సమయంలో మా ఆర్థిక పరిస్థితులు ఇప్పటిలా లేవు. దాంతో వారి వివాహాన్ని చాలా సింపుల్‌గా చేశాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దాంతో నా పెళ్లైనా ఘనంగా చేయాలని మా అమ్మ ముచ్చటపడుతోంది. ఆమె సంతోషం కోసం నేను కూడా ఇందుకు అంగీకరించానని తెలిపాడు స్టార్ కమెడియన్..నటుడు..నిర్మాత కపిల్ శర్మ. ఈ ఏడాది డిసెంబర్ 12న తన ప్రేయసి గిన్నీ ఛత్రాత్‌ను వివాహం చేసుకొబోతున్నట్లు వెల్లడించాడు. అనంతరం డిసెంబర్ 14న ముంబైలో బాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. వివాహ వేడుక మాత్రం గిన్ని స్వంత ఊరైన జలంధర్‌లో జరగనున్నట్లు పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa