రణబీర్ కపూర్, అలియా భట్ జంటకు ఈ మధ్యనే వివాహం అయ్యింది. పెళ్లైన రెండు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ సమయంలో కూడా అలియా షూటింగ్స్ కు వెళ్తూ అందరిచేత ప్రశంసలు అందుకున్నారు. తాజాగా రణబీర్, అలియా నటించిన బ్రహ్మాస్త సెప్టెంబర్ 9న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా అలియా తన బేబీ బంప్ తో కనిపించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
