కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన కొత్త చిత్రం "కోబ్రా". క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.
ఆగస్టు 31వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం భాషలలో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్విరామ ప్రమోషన్స్ ను జరుపుకుంటుంది. చెన్నై, బెంగుళూరు, కొచ్చిలలో ప్రమోషన్స్ చేసిన కోబ్రా టీం ఆగస్టు 28న అంటే రేపు హైదరాబాద్ లో ప్రచారం చెయ్యనున్నారు. హైదరాబాద్లోని శరత్ సిటీ క్యాపిటల్లో రేపు సాయంత్రం ఆరింటినుండి నుండి "కోబ్రా :మీట్ & గ్రీట్" కార్యక్రమం జరగనుంది.
ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa