పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరికి విడుదల కాబోతుంది.
షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. పోతే, ఈ మూవీ నుండి ఒక్క టైటిల్ పోస్టర్ తప్ప ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్స్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఆదిపురుష్ గా ప్రభాస్ ఫస్ట్ లుక్ సెప్టెంబర్ నెల్లో విడుదల కాబోతుందని అంటున్నారు. ఈ విషయంపై జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.
![]() |
![]() |