2022 ... బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియాభట్ జీవితంలోనే చాలా స్పెషల్ అండ్ మెమొరబుల్ అని చెప్పవచ్చు. ఈ ఏడాదిలోనే ఐదేళ్లుగా ప్రేమిస్తున్న హీరో రణ్ బీర్ కపూర్ ను పెళ్లాడింది. ఈ ఏడాదిలోనే హాలీవుడ్ డిబట్ ఎంట్రీ మూవీ షూటింగ్ లో పాల్గొంది. ఈ ఏడాదిలోనే అమ్మ కూడా కాబోతుంది.
2022 సంవత్సరంలో ఇన్ని మెమొరబుల్స్ అండ్ సర్ప్రైజెస్ అందుకున్న ఆలియా ఈ ఏడాదిలోనే ప్రతి నటుడి చిరకాల కోరికైన ఆస్కార్ అవార్డును కూడా అందుకోబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఇంతకూ విషయమేంటంటే, సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో ఆలియాభట్ మెయిన్ లీడ్ లో నటించిన "గంగూభాయ్ కతియావాడి" సినిమా ఈ ఏడాదిలోనే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక్కడే కాదు విదేశాల్లో కూడా ఈ సినిమా బంపర్ హిట్. దీంతో ఈ సినిమాలో తన అత్యద్భుతమైన నటనకుగాను ఆలియా తప్పక ఆస్కార్ అందుకునే చాన్సులున్నాయని అంటున్నారు. మరైతే ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa