కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా 'కోబ్రా'. ఈ సినిమాకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 31న విడుదల కానుంది. అయితే విక్రమ్ కోబ్రా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో బాలీవుడ్‌లో బాయ్ కట్ ట్రెండ్ నడుస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటని విక్రమ్ ని ప్రశ్నించగా... విక్రమ్ మాట్లాడుతూ నాకు బాయ్ తెలుసు గర్ల్ తెలుసు. ఇంగ్లీష్ లో కాట్ అంటే కూడా తెలుసు ఈ బాయ్ కాట్ అంటే ఏంటి..?” అని ఫన్నీగా స్పందించారు.ప్రస్తుతం విక్రమ్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa