ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోయపాటి సినిమా కోసం కొత్త లుక్ లో కనపడనున్న రామ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 29, 2022, 04:57 PM

హీరో రామ్ పోతినేని కృతి జంటగా నటించిన చిత్రం  ది వారియర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వం లో నిర్వమించిన ఈ చిత్రం అనుకున్నంత విజయం అందించలేకపోయంది . ఇప్పుడు రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నిర్మస్తున్న ఈ   సినిమా పైనే తన దృష్టి సాధించినట్టు తేలుస్తుంది . ఈ సినిమా  భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న  సినిమా గురించి ఓ క్రేజీ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం హీరో రామ్‌ తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు రామ్ కూడా ఈ కండిషన్‌కి వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.అంతేకాకుండా ఈ సినిమాలో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రెండు పాత్రల్లో వేరియేషన్స్‌ కోసం రామ్‌ కొత్తగా మేకోవర్‌ అవనున్నారట. కాగా అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న ప్రాజెక్ట్‌ కావడం, అందులోనూ పాన్‌ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa