ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాడ్ చేయనని చెప్పేసిన స్టార్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 04:43 PM

స్టార్ హీరో హీరోయిన్స్ పలు బ్రాండ్లకు అంబాసిడర్స్‏గా ఉండడం.. కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేయడం సర్వసాధారణం. ఇప్పటికే పలు హీరోలు హీరోయిన్స్ .  పొగాకు కంపెనీలు వంటి  ప్రకటనలను  కోట్ల ఆఫర్ తిరస్కరిస్తున్నారు . అలాగే తాజాగా ఒక బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా తనవరకు వచ్చిన రూ. 9 కోట్లు డీల్ ఆఫర్ ను రిజెక్ట్ చేసి షాకిచ్చారు . పాన్ మసాలా ప్రకటన చేయాలంటూ కార్తీక్ కు రూ.8-9 కోట్ల డీల్ ఆఫర్ వచ్చింది. తనను అభిమానించే ప్రజలు మత్తు కలిగించే ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు తాను ప్రోత్సహించనంటూ కార్తీక్ ఈ ఆఫర్ నో చెప్పినట్లుగా సన్నిహితులు తెలిపారు. ఇటీవలే భూల్ భూలయ్య 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరోకు ఇన్ స్టాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. పాపులర్ సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‏స్టాలో పోస్ట్ చేస్తూ పాన్ మసాలా ప్రకటన కోసం కార్తిక్ 9 కోట్ల ఆఫర్ తిరస్కరించినట్లు తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa