ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైతూ సహకారం మరువలేనిది

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 26, 2018, 05:02 PM

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' నిర్మితమైంది. ఈ సినిమా ద్వారా నిధి అగర్వాల్ కథానాయికగా పరిచయమవుతోంది. నవంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ .. "నేను హిందీలో చేసిన 'మున్నా మైఖేల్' చూసి, ఈ సినిమా కోసం చందూ మొండేటి గారు సంప్రదించారు. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశాను.


చందూ గారు నా పాత్రను చాలా బాగా మలిచారు. ఈ సినిమాలో నేను ఇండిపెండెంట్ గర్ల్ గా కనిపిస్తాను. నా పాత్ర కారణంగానే ఈ సినిమా కీలకమైన మలుపు తిరుగుతుంది. ఇక నటన విషయంలో చైతూ ఎంతో సహకరించారు. ఈ సినిమాలో నేను బాగా చేశానని ఎవరైనా అంటే, ఆ క్రెడిట్ చందూ .. చైతూలకు దక్కుతుంది. ఈ సినిమా నా కెరియర్ కి ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa