తెలుగు డైరెక్టర్ కేవీ అనుదీప్ కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తో చేస్తున్న సినిమా "ప్రిన్స్'. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాతోనే శివ కార్తికేయన్ టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫార్మ్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో ఈ మూవీ మేకర్స్ పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ను షేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అలానే శాటిలైట్ రైట్స్ కొచ్చేసరికి స్టార్ మా కొనుగోలు చేసిందట. ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుందట.
అనుదీప్ గత చిత్రం "జాతిరత్నాలు" బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై తెలుగులో చాలా మంచి అంచనాలున్నాయి. అదే విధంగా కోలీవుడ్ లో శివకార్తికేయన్ కు సూపర్ క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడతాయి. దీంతో అక్కడ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పోతే, ఈ మూవీ ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa