టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బయట కనిపిస్తే పెద్ద ఎత్తున వస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బాలీవుడ్ నుండి విడుదల కాబోతున్న తాజా పాన్ ఇండియా చిత్రం "బ్రహ్మాస్త్ర" తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ హాజరవుతున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. ఇక నిన్న జరగాల్సి ఉండగా అనుకోకుండా వివిధ కారణాల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దీంతో ఈ ఈవెంట్‌ని ఎన్టీఆర్ సమక్షంలో చాలా సింపుల్‌గా చేశారు మేకర్స్. అయితే తనను చూసేందుకు వచ్చిన అభిమానులందరికీ క్షమాపణలు చెబుతున్నానని, అయితే వివిధ కారణాల వల్ల అభిమానులతో ఈ కార్యక్రమం నిర్వహించడం కుదరలేదని, అందుకే ప్రతి అభిమానికి క్షమాపణలు చెబుతున్నానని తారక్ తెలిపాడు.