మధు కిరణ్ దర్శకత్వంలో జార్జ్ రెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ నటించనున్న పాన్ ఇండియా సినిమాలో ప్రేక్షకులకు సుపరిచితమైన సింహా కూడా భాగమయ్యారు. ఈ సినిమాకి 'రావణ కళ్యాణం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపిక, రీతూ గాయత్రి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేసి ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించారు. స్టార్ హీరో సత్యదేవ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సందర్భంగా సింహా మాట్లాడుతూ.. రావణ కళ్యాణం చాలా ఆసక్తికరమైన కథాంశమని, సందీప్ తో కలిసి పనిచేయడానికి మరింత ఉత్సాహంగా ఉన్నానని అన్నారు. కథ వినగానే ఎంత ఎగ్జైట్ అయ్యానో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అంతే ఎగ్జైట్ అవుతారని వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నామని దర్శకుడు జెవి మధు కిరణ్ తెలిపారు.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని హాల్సియోన్ మూవీస్, MFF ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై సూరపనేని అరుణ్ కుమార్ మరియు రేష్మి సింహా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa