కార్తీక్ వర్మ దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో ఆంధ్రాలోని మారుమూల గ్రామానికి వచ్చే ఇంజనీర్‌గా ఆ గ్రామంలో జరిగిన అనుమానాస్పద మరణాల వెనుక కథను తెలుసుకోవడానికి వచ్చిన ఇంజనీర్‌గా కనిపించనున్నారు అని లేటెస్ట్ టాక్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 5, 2022న కేరళలో తిరిగి ప్రారంభించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2022 నవంబర్ చివరి నాటికి మొత్తం షూటింగ్‌ను ముగించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు లేటెస్ట్ టాక్. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa