ఐకానిక్ మూవీ "అన్నమయ్య" తదుపరి టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున - రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వచ్చిన భక్తిరసాత్మక చిత్రం "శిరిడి సాయి".
2012, సెప్టెంబర్ 6న విడుదలైన ఈ మూవీ నేటితో దశాబ్దం పూర్తి చేసుకుంది. అప్పట్లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, సాయిబాబాగా నాగార్జున అద్భుతమైన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. నాగార్జున సినీ కెరీర్లోనే ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో కనబరిచారు.
శ్రీకాంత్, శ్రీహరి, సాయికుమార్, శరత్ బాబు, సాయి కిరణ్, కమలినీ ముఖర్జీ తదితర ప్రముఖులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని AMR సాయి కృప ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa