ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న రిలీజ్ ఐన కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కొత్త చిత్రం "విరుమాన్" లేటెస్ట్ గా డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల్లోనే విరుమాన్ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాతో డైరెక్టర్ శంకర్ కూతురు అదితి సినీ కెరీర్ ను స్టార్ట్ చేసింది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముత్తయ్య డైరెక్ట్ చేసారు. ఈ మూవీ లో కార్తీ గ్రామీణ యువకుడిగా, పక్కా మాస్ పాత్రలో కనిపిస్తారు. ప్రకాష్ రాజ్, రాజ్ కిరణ్, శరణ్య, ఇంద్రజ , మనోజ్ భారతీరాజా, సింగంపులి ముఖ్య పాత్రలలో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa