మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి ఈరోజు 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో నటిస్తున్న "ఏజెంట్" నుండి స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మమ్ముట్టి ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ టు సినిమాస్ సంయుక్త బ్యానర్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఒక్క మళయాళంలోనే కాక అన్ని సౌత్ లాంగ్వేజెస్ తో పాటు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలలో కూడా మమ్ముట్టి నటించారు. స్వాతి కిరణం, సూర్య పుత్రులు, యాత్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మమ్ముట్టి నటిస్తున్న తెలుగు చిత్రమే ఏజెంట్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa