కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్ తన ఐకానిక్ మూవీ "ఇండియన్" (తెలుగులో భారతీయుడు) కు సీక్వెల్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. కొన్ని నాటకీయ పరిణామాల తదుపరి ఇటీవలే ఈ మూవీ పునఃప్రారంభించబడింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్ధ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా నిన్నటితో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, సెప్టెంబర్ 3వ వారం నుండి న్యూ షెడ్యూల్ ను స్టార్ట్ చెయ్యబోతుంది. ఈ షెడ్యూల్ లో హీరో కమల్ మరియు హీరోయిన్ కాజల్ పాల్గొనబోతున్నారు.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ లపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa