ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బుజ్జి ఇలా రా'కి వచ్చిన స్పందనపై హర్షం వ్యక్తం చేసిన ధన్‌రాజ్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 06:15 PM

గరుడవేగ అంజి దర్శకత్వంలో 'బుజ్జి ఇలా రా' సినిమాతో కమెడియన్ ధనరాజ్ కథానాయకుడిగా అరంగేట్రం చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా గత శుక్రవారం థియేటర్లలో విడుదలయ్యింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా సినీప్రేమికులని, ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. 'బుజ్జి ఇలా రా' సినిమాలో ధనరాజ్ పోలీస్ గా నటించాడు. ఈ సినిమాలో తన నటనకు వస్తున్న రెస్పాన్స్‌తో చాలా హ్యాపీగా ఉంది అంటూ ధనరాజ్ వెల్లడించారు.


చాలా సంవత్సరాలుగా, ధన్‌రాజ్ కామెడీ పాత్రలలో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. బ్రహ్మానందం వంటి గొప్ప హాస్యనటులతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నాడు. ఈ సినిమాలో సునీల్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందించారు. అగ్రహారం నాగి రెడ్డి, ఎన్. సంజీవ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa