థాంక్యూ, లాల్ సింగ్ చద్దా వంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చైతూ చెయ్యవలసిన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అలానే పరశురామ్ చైతూ కోసం మంచి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.
వీళ్ళిద్దరూ కాకుండా చైతూ అప్ కమింగ్ డైరెక్టర్ల లిస్టులోకి కొత్తగా ఒక కొత్త డైరెక్టర్ వచ్చి చేరాడు. ఆయనెవరో కాదు... విరాటపర్వం వంటి కథా బలమున్న సినిమాను తీసి విమర్శకుల ప్రశంసలందుకున్న డైరెక్టర్ వేణు ఉడుగుల. ప్రస్తుతం చైతూ ఎలాంటి షూటింగులు లేక ఖాళీగా ఉండడంతో వేణు ఆయనకు కొన్ని కథలు వినిపిస్తున్నారట. మరి, వీటిలో ఏది ఫైనల్ అవుతుందో...! వేణు చైతూని ఒప్పిస్తాడా? అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.