కొత్త నటీనటులతోనే రూపొందుతోన్న సినిమా 'అలిపిరికి అల్లంత దూరంలో' మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతి నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. రమేశ్ - రెడ్డి రాజేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సినిమా టీజర్ ను కొంతసేపటి క్రితం దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు, జీవితంలో పైకి రావడానికి ట్రై చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ సవ్యంగా సాగిపోతుందనుకునే లోగానే అతనికి ఒక అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. అదేమిటనేదే కథ.
ఒక వైపున డబ్బుకి సంబంధించిన సమస్య .. మరో వైపున దానితో ముడిపడిన ప్రేమ .. మధ్యలో నలిగిపోయే హీరో. ఈ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రమేశ్ - రెడ్డి రాజేంద్ర నిర్మించిన ఈ సినిమాకి ఆనంద్ దర్శకత్వం వహించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa