సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ "యశోద" టీజర్ కొంచెంసేపటి క్రితమే విడుదలయ్యింది. టీజర్ ఆద్యంతం చాలా థ్రిల్లింగ్ గా సాగింది. ఈ సినిమాలో సమంత "యశోద" అనే ప్రెగ్నన్ట్ లేడీగా నటిస్తుంది. గర్భవతిగా ఉన్న సమంత ఎవరో కొంతమంది వ్యక్తులతో భీకరంగా పోరాడుతూ ఉంటుంది. తనను తరుముతున్న వారినుండి తప్పించుకుంటూ పుట్టబోయే బిడ్డను యశోద ఎలా కాపాడుకుంది? అన్నదే కథ అని టీజర్ బట్టి అర్ధమవుతుంది. టీజర్ కట్ చేసిన విధానం ప్రత్యేక ఆకర్షణ. టీజర్ మొత్తం కూడా ఒక్క సమంత, ఆమెతో మాట్లాడే డాక్టర్, ఒక సీన్లో ఉన్ని ముకుందన్ తప్పించి మరెవ్వరూ కనిపించరు.
హరి శంకర్, హరీష్ నారాయణ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు.