దేశప్రజల దృష్టిని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్'. తొంభైలలో కాశ్మీర్ పండిట్లు ఎదుర్కొన్న అవమానాలు, వారిపై జరిగిన అకృత్యాలు, వారి ఊచకోత నేపథ్యంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ మెప్పును సైతం ఈ మూవీ పొందడం విశేషం. ఈ సినిమాకు ప్రశంసలు ఎంతలా వచ్చాయో విమర్శలు, నిరసనలు కూడా అదేవిధంగా వెల్లువెత్తాయి. అయితే ఇలాంటివన్నీ ఏమీ పట్టించుకోని ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగానో ఆదరించారు. బాలీవుడ్లో దాదాపు 250కోట్ల భారీ కలెక్షన్లతో అక్కడి రికార్డులను తిరగరాసింది.
ధియేటర్ల గోడలను బద్దలు చేసిన ఈ మూవీ ఇటీవలే టాలీవుడ్ ప్రేక్షకులను బుల్లితెరపై పలకరించింది. అద్దిరిపోయే TRP వస్తుందనుకుంటే, చాలా తక్కువ (1.35)రేటింగ్ రావడం కాస్తంత షాక్ కు గురి చేసే విషయమే.