నేడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ జన్మదినం. సినిమాలలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా చేసే అక్షయ్ నిజజీవితంలోనూ ప్రాణాలకు తెగించి ఓ వ్యక్తిని కాపాడారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని నిర్మాత విపుల్ షా వెల్లడించారు. తన భద్రత గురించి ఆలోచించకుండా, విద్యుత్ కేబుల్‌పై కాలు పెట్టిన వ్యక్తిని రక్షించడానికి అక్షయ్ వెళ్లాడన్నారు. కరెంట్ షాక్‌కు గురవకుండా ఆ వ్యక్తిని అక్షయ్ కాపాడి నిజ జీవితంలోను హీరో అనిపించుకున్నారని అన్నారు.