'కేరింత' ఫేమ్ విస్వంత్ దుద్దునపూడి, మాళవిక సతీషన్ కంభంపాటి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్". ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకుడు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి నీవెవ్వరో అనే మెలోడియస్ సాంగ్ యొక్క ఫుల్ వీడియో విడుదలైంది. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఈ పాటలో చూడొచ్చు. పోతే, ఈ పాటను గోపి సుందర్ స్వరపరచగా, చిన్మయి ఆలపించారు. రెహమాన్ లిరిక్స్ రాసారు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, స్వస్తిక సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, వేణుమాధవ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa