చాన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్ కు "విక్రమ్" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నిచ్చింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, హీరో సూర్య నటించారు.
జూన్ 3న తెలుగు, తమిళం, హిందీ భాషలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా లేటెస్ట్ గా వందరోజులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఓటిటిలో కూడా ఎప్పటినుండో అందుబాటులోకొచ్చిన ఈ సినిమా వందరోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ మరియు రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ పై కమల్ హాసన్ , ఉదయానిథి స్టాలిన్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa