ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హను రాఘవపూడి రిలీజ్ చెయ్యనున్న "నీతో" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 05:53 PM

అభిరాం వర్మ, సాత్వికా రాజ్ జంటగా నటిస్తున్న చిత్రం "నీతో". ఈ సినిమాకు రచయిత, దర్శకుడు బాలు శర్మ. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ట్రైలర్ అప్డేట్ వచ్చింది.
సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 09:31 నిమిషాలకు ఈ మూవీ ట్రైలర్ విడుదల కాబోతుంది. "సీతారామం" సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న హను రాఘవపూడి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ కానుంది.
మిలియన్ డ్రీమ్స్, పృథ్వి క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లపై AVR స్వామి, కీర్తన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa