సీతారామం సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, లేటెస్ట్ గా 'చుప్' అనే యూనివర్సల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆర్. బాల్కి ఈ సినిమాకు దర్శకుడు. తక్కువ రేటింగ్, నెగిటివ్ రివ్యూలిచ్చే ఫిలిం క్రిటిక్స్ పై సీరియల్ కిల్లర్ గా మారిన ఒక ఆర్టిస్ట్ ఎలా పగ తీర్చుకున్నాడు అనే విభిన్నమైన, సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. రీసెంట్గా రిలీజైన ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా నుండి గయా గయా గయా అనే లిరికల్ సాంగ్ సెప్టెంబర్ 12వ తారీఖున విడుదల కాబోతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. పోతే, ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa