కొంచెంసేపటి క్రితమే నాగశౌర్య హీరోగా నటిస్తున్న "కృష్ణ వ్రింద విహారి" మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. విభిన్నమైన లవ్ ట్రాక్ తో, బలమైన ఫ్యామిలీ నేపథ్యంతో, హిలేరియస్ కామెడీ సీన్లతో ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఆహ్లాదంగా, ఆసక్తిగా సాగింది. ట్రైలర్ ను బట్టి ఈ సినిమాతో నాగశౌర్య గ్రాండ్ సక్సెస్ అందుకోబోతున్నాడని అర్ధమవుతుంది.
అనీష్ R కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్ షెర్లీ సెటియా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూలుపురి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 23వ తేదీన విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa