ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి ధ‌ర్మ తేజ్ చిత్ర ల‌హ‌రిలో ల‌హ‌రిగా నివేథ పేతురాజ్..

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 06, 2018, 10:22 AM

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్ర లహరి’ అనే చిత్రంలో నటించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జ‌రిగాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లుకు ప్రాధాన్యం వుంది. ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియ దర్శిని ఈచిత్రానికి మొదటి హీరోయిన్ . తాజాగా తమిళ నటి నివేథ‌ పేతురాజ్ ను మరో హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఈచిత్రంలో కళ్యాణి ‘చిత్ర’ పాత్రలో నటించనుండగా నివేథ‌‘లహరి’ పాత్రలలో నటించనుంది.


మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో సునీల్ ముఖ్య పాత్రలో నటించనున్నాడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa