సాంఘీక చిత్రాలే కాకుండా భక్తిరస చిత్రాలు, పౌరాణిక చిత్రాల్లో కృష్ణంరాజు నటించి మెప్పించారు. విశ్వనాథ నాయకుడు సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా, కురుక్షేత్రంలో కర్ణుడుగా, శ్రీ వినాయక విజయంలో శివుడిగా, భక్త కన్నప్ప సినిమాలో శివ భక్తుడిగా అలరించాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన భక్త కన్నప్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో కృష్ణంరాజు కెరీర్ లోనే మరో బెస్ట్ చిత్రంగా నిలిచిపోయింది.