తెలుగు సినిమాలపై హీరోయిన్ అమలాపాల్ కీలక వ్యాఖ్యలు చేసింది. 2011-2015 మధ్య 4 తెలుగు సినిమాల్లో తాను నటించానని, అయితే టాలీవుడ్‌తో కనెక్ట్ కాలేకపోయానని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తెలుగు సినిమాలు భిన్నంగా ఉంటాయని తెలిపింది. ఎప్పుడూ ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ప్రేమ సన్నివేశాలు, పాటల కోసమే వారిని తీసుకుంటారని వివరించింది. టాలీవుడ్‌ను గ్లామరస్ ఇండస్ట్రీగా ఆమె అభివర్ణించింది.