కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం "వారసుడు" (తమిళంలో "వారిసు"). వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ తెలుగు, తమిళ భాషలలో కలిపి సుమారు 120 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తుంది. ప్రఖ్యాత ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో 60 కోట్లు పెట్టి ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను, సన్ నెట్ వర్క్ యాభై కోట్లు పెట్టి ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను, మరో పదికోట్లేమో ఆడియో రైట్స్... ఇలా మొత్తంగా వారసుడు సినిమా పోస్ట్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు హాట్ కేకుల్లా సేల్ అయిపోయాయని వినికిడి.
పోతే, ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa