హర్యానా బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ మృతి కేసును తమ ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తున్నట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ సోమవారం తెలిపారు. గోవా పోలీసులపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. అయితే ప్రజల డిమాండ్ మేరకు కేసును సీబీఐకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. సోనాలి కుమార్తె కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేశారన్నారు. ఆగస్టు 23న సోనాలికి విషమిచ్చి ఆమె సన్నిహితులే హత్య చేసినట్లు విచారణలో తేలింది.