ట్యాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు పోలీసాఫీసర్ గా నటిస్తున్న చిత్రం "అల్లూరి". ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇందులో కయదు లోహర్ హీరోయిన్ కాగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా నుండి ఒక్కోటిగా ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేస్తున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 11:07 గంటలకు 'వేదనే ఆవేదనే' అనే లిరికల్ పాట విడుదల కాబోతుందని కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa