ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఒకేఒక జీవితం" నుండి అమ్మ వీడియో సాంగ్ ఔట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 05:27 PM

ఈ రోజు అక్కినేని అమల గారి పుట్టినరోజు సందర్భంగా, చాన్నాళ్ల తరవాత ఆమె నటించిన సినిమా "ఒకేఒక జీవితం" నుండి మేకర్స్ అమ్మ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. కలెక్షన్లు కూడా రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నాయి.
అమ్మ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా, లేట్ లిరిక్ లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు సాహిత్యం అందించారు. జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఈ పాటలో అమ్మ, కొడుకుల మధ్య అనుబంధాన్ని హార్ట్ టచింగ్ గా చూపించారు.
కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా, డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa