అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'కోబ్రా' ఆగస్టు 31న గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ చిత్రం OTT రైట్స్ ని సోనీ Liv భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన వీడియోలో, సోనీ LIV అధికారికంగా కోబ్రా మూవీని తన ప్లాట్‌ఫారమ్‌లో త్వరలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబరు 23 లేదా 31, 2022న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయం గురించిన అధికారక ప్రకటన వెలువడనుంది.
ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, మృణాళిని రవి, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు.