మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , అదితి రావు హైదరి, లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా మూవీ అంతరిక్షం.. ఈ మూవీకి ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకుడు.. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా లో వరుణ్ వ్యోమగామిగా కనిపించనున్నాడు. దీపావళి సందర్భంగా చిత్రం నుండి పోస్టర్ విడుదల చేశారు. ఇందులో లావణ్య , వరుణ్ తేజ్‌లు ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తున్నారు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతంజ వి.ఎస్. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa